బీరం సుదాకరెడ్డి సమర్పణలో సింహా ఫిలిమ్స్, మరియు దీపాల ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘సకల కళా వల్లభుడు’. తనిష్క్ రెడ్డి,మేఘ్లా ముక్తా హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి శివగణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 1 న విడుదల కానున్న సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే
చిత్రనిర్మాతలు అనిల్, శ్రీకాంత్ మాట్లాడుతూ యాక్షన్,కామెడీ లతో పాటు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఫిబ్రవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి హీరో పెర్ఫార్మన్స్,కథ,కధనాలు హైలెట్ గా నిలవనున్నాయు. సినిమాలో నటించిన ఏ ఒక్కరూ కొత్త వారిలా అనిపించరు. అంత అద్భుతంగా పెర్ఫామెన్స్ ను ఇచ్చారు. ఇక హీరో తనిష్క్ రెడ్డి అయితే ఆయనలో ఉన్న ప్రతి టాలెంట్ ను టైటిల్ కు తగ్గట్టు బెస్ట్ పెర్ఫామెన్స్ ను ఇచ్చారు. ఫ్యూచర్ లో బిగ్ స్టార్ అవుతాడు. అతనితో మరిన్ని సినిమాలు చేయలనుకుంటున్నాము. మా సకల కళా వల్లభుడి సినిమాకు బి సి, నైజాం, సీడెడ్ లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్నారు.
చిత్ర దర్శకుడు శివ గణేష్ మాట్లాడుతూ సినిమా చాలా బాగొచ్చింది. సినిమా చేసాక కంటే చూసుకున్న తరువాత చాలా సంతృప్తి తో ఉన్నాను.. నిర్మాతల సపోర్ట్ లేకపోతే ఇంతబాగా వచ్చేది కాదు. హీరో తనిష్క రెడ్డి బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. 2019 లో తప్పకుండా హిట్ సినిమా అవుతుందని అన్నారు. హీరో తనిష్క్ రెడ్డి మాట్లాడుతూ… సినిమా కథలో కంటెంట్ ఉంటే ఆదరించి సపోర్ట్ చేసే సినిమా పెద్దలు చాలా మందే ఉన్నారు. అలా మా సినిమాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన వ్యక్తే.. బీరం సుధాకర్ రెడ్డి గారు. ఆయనకు మా నిర్మాతలు అనిల్, శ్రీకాంత్ లు తోడై ఖర్చుకు వెంకడకుండా రిచ్ గా తెరకెక్కించారు. ఇక డైరెక్టర్ శివ తో పాటు మిగతా వారు కూడా వారి వారి డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకోవడానికి కష్టపడ్డారు. టెక్నీషియన్స్ విజయ్, నాని, ధర్మేంద్ర లు బెస్ట్ వర్క్ ను అందించారు. క్వాలిటీ కోసం ఎక్కువగా కష్టపడ్డారు. ఇక మ్యూజిక్ అందించిన అజయ్ నాకు కాంపిటీషన్ గా నిలిచారు. 4 సాంగ్స్, 4 ఫైట్స్, కామెడీ ఇలా అన్నీ ఆదరగొట్టేశారు. వంద థియేటర్లలో సినిమా విడుదల కానుంది. చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు.
నటుడు రాజేంద్ర కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్, నటి అలెక్సా, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తనిష్క్ రెడ్డి,మేఘ్లా ముక్తా,సుమన్,పృథ్వి,జీవా,చిన్నా,అపూర్వ,శృతి,విశ్వ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సాయి చరణ్,సంగీతం:అజయ్ పట్నాయక్,ఎడిటింగ్: ధర్మేంద్ర,పి ఆర్ ఓ: బి.వీరబాబు,సమర్ఫణ బీరం సుధాకర్ రెడ్డి,నిర్మాతలు: అనిల్,త్రినాధ్,కిషోర్,శ్రీకాంత్ ,కథ స్క్రీన్ ప్లే ,మాటలు దర్శకత్వం: శివ గణేష్.