ప్రతి జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్… ఇది కదా మెగాస్టార్ అంటే

ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటైన ఇంద్ర సినిమాలో ఇంద్ర సేనా రెడ్డి అదే మన చిరంజీవి రాక్షస సంహారం చేసి వర్షం కోసం హోమం చేస్తాడు. వర్షం పడే సమయంలో ఈ పాట వస్తుంది. మణిశర్మ మ్యూజిక్ కి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు కలిసి ఈ ఘళ్లు ఘళ్లు అనే పాటని ఒక క్లాసిక్ గా చేశాయి. ఈ సూపర్ హిట్ సాంగ్ లో ఒక లిరిక్ ఉంటుంది… “మహారాజు తాను సమిధాల్లే మారి నిలువెల్లా వెలిగేరా, భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా ఎదిగేరా… జన క్షేమమే తన సంకల్పుగా, తన ఊపిరే హోమజ్వాలగా… స్వర్గాన్నే శాసించేనుగా, అమృతముని నెలకు దించెనుగా…”. ఈ అక్షరాలు చిరంజీవి స్వభావానికి నిలువెత్తు ప్రతి రూపాలు. ఇంతకీ ఈ పాట ఇప్పుడు తలుచుకునే అవసరం ఎందుకు వచ్చిందో చూడండి.

మెగాస్టార్ చిరంజీవి… దాసరి గారు పోయిన తర్వాత ఇండస్ట్రీకి ఆయన పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నా అంటూ వెంటనే స్పందిస్తున్నారు. నిజానికి చిరంజీవి గారు సేవ చేయడం కొత్త కాదు, 1998 నుంచి ఈరోజు వరకూ చిరంజీవి అనే పేరు వినగానే సినిమాలతో పాటు ఆయన చేసే సామజిక సేవ గుర్తొస్తుంది. కష్టం వస్తే దేవుడు వస్తాడో లేదో తెలియదు కానీ ఆ కష్టం చిరంజీవి వరకూ వెళ్తే ఆయన వస్తాడు, ఆ కష్టం తీరుస్తాడు. అది కొణిదెల శివ శంకర్ నైజం. ఇప్పటికే ఐ బ్యాంక్, బ్లడ్ బ్లాంక్ ల ఏర్పాటుతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన చిరంజీవి, మరో అడుగు ముందుకి వేస్తూ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ని తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. కరోనా సమయంలో ఏ ఒక్కరూ ఆక్సిజన్ లేకుండా మరణించకూడదు అనే సంకల్పంతో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా వారంలోనే రెడీ చేస్తున్నారు, అన్ని ఆక్సిజన్ బ్యాంక్స్ వారంలో రెడీ అవ్వాలి అంటే యుద్ధ ప్రాతిపదికన పని జరుగుతున్నట్టే. ప్రజల కష్ట సమయంలో ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నావ్ చూడు బాసు, నువ్వు గ్రేట్. నిన్ను మాకు ఇచ్చిన సినిమాకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం.