పవన్ అభిమానులకు త్రిబుల్ ధమాకా

మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో తెరకెక్కించిన వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగిసింది. ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. సమ్మర్‌కి ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశముంది. అయితే ఈ ఏడాది పవన్ అభిమానులకు మరిచిపోలేని ఇయర్‌గా మారనుంది. ఎందుకంటే.. పవన్ నటిస్తున్న మూడు సినిమాలు ఈ సంవత్సరం విడుదల అయ్యే అవకాశముంది.

PAWAN THREE MOVIE RELEASE

వకీల్ సాబ్‌తో పాటు క్రిష్ డైరెక్షన్‌లో పవన్ చేస్తున్న సినిమా కూడా ఈ ఏడాది విడుదల అయ్యే అవకాశముంది. ఇక మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్‌ కోషియం’సినిమా తెలుగులోకి రీమేక్ కానుండగా.. ఇందులో పవన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది కూడా ఈ ఏడాది విడుదల అయ్యే అవకాశముంది.