నాని ‘శ్యామ్ సింగరాయ్’ కోసం త‌ర‌లివ‌స్తున్న క‌ల‌క‌త్తా కాళీ ఆల‌యం!

న్యాచుర‌ల్ స్టార్ నాని తన నటనతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించి మరింత కొత్తగా తనని చూపించడానికి సినిమా సినిమాకి తన పాత్రల్లో వ్యత్యాసం చూపిస్తున్నాడు. మ‌రికొన్ని రోజుల్లో తన నెక్స్ట్ సినిమా శ్యామ్ సింఘరాయ్ పట్టాలెక్కబోతుంది. ఇది నాని కెరీర్‌లో 27వ సినిమా. ఫ‌స్ట్‌టైం నాని కెరీర్‌లో పిరియాడిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమా కథ ప్రకారం ఎక్కువగా కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో జరుగబోతుందని స‌మాచారం. అది కూడా 20 ఏళ్ల క్రితం కథ.

ఇక ఇప్పుడు కలకత్తాలో పాత‌కాలం ఉన్న‌ట్లు లేదు కాబ‌ట్టి పాత కలకత్తా కాళి ఆలయంను, ప‌రిసర ప్రాంతాలను హైదరాబాద్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో నిర్మించబోతున్నారు. సుమారుగా 40కోట్ల‌తో ఈ సినిమా రెడీ అవుతుందని స‌మాచారం. కాగా 2021 చివ‌రిలో రిలీజ్ చేస్తారంటున్న ఈ సినిమాను ట్యాక్సీవాలా సినిమా డైరెక్టర్ రాహుల్ సంకీర్త్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండ‌గా.. మిక్కీ జే.మేయ‌ర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో నానికి జోడీగా ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. ఒక‌రు సాయి పల్లవి కాగా ఉప్పెన ఫేం కీర్తిశెట్టి మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.