డైనమిక్ హీరో శర్వానంద్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మనమే’ జూన్ 7వ థియేటర్స్ లోకి వస్తోంది. ఇప్పటికే ఎట్రాక్టివ్ ప్రమోషనల్ కంటెంట్ తో మూవీ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. మేకర్స్ ప్రమోషన్స్ యాక్టివిటీస్ ని దూకుడుగా చేస్తున్నారు. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేశారు.
శర్వానంద్ తన గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తున్న కృతి శెట్టి, కిడ్ విక్రమ్ ఆదిత్య ఎయిర్ ప్లేన్ లో వుండగా ఎయిర్ హోస్టెస్‌తో శర్వానంద్ ఫ్లర్ట్ చేయడాని ట్రై చేస్తున్న సీక్వెన్స్ తో హీరో క్యారెక్టర్ ని ప్రజెంట్ చేస్తూ ట్రైలర్ బిగెన్ అయ్యింది. కృతి శెట్టి లైఫ్ లో చాలా స్ట్రిక్ట్. శర్వా లైఫ్ లో జీరో టెన్షన్‌లు, రెస్పాన్స్ బిలిటీస్ లేని కూల్ పర్శన్. ఆమె కోసం తనను తాను మార్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు అసలు ప్రాబ్లమ్స్ ఎదురౌతాయి. ట్రైలర్ లో ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా వున్నాయి.
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చాలా మెచ్యూర్ కథను ఎంచుకుని చాలా కేర్ తో హ్యాండిల్ చేసాడు అనేది ట్రైలర్‌లో క్లియర్ గా కనిపిస్తోంది. మూడు పాత్రల చుట్టూ తిరిగే ఈ కథలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నాయి. స్టైలిష్ టేకింగ్, డైలాగ్స్ నెరేటివ్ ని ఆకట్టుకునేలా చేశాయి.
శర్వానంద్ తన ఛార్మ్ , స్క్రీన్ ప్రెజెన్స్, చరిష్మాతో మెస్మరైజ్ చేశాడు. యాక్షన్ సీన్స్ స్టైలిష్‌గా ఉన్నాయి. క్యూట్ మూమెంట్ విశేషంగా అలరించాయి. అతని కామిక్ టైమింగ్ అద్భుతంగా వుంది. కృతి శెట్టికి చాలా స్ట్రిక్ట్, కేరింగ్‌గా వుండే క్యారెక్టర్ లో ఆకట్టుకున్నారు. విక్రమ్ ఆదిత్య క్యూట్‌గా ఉన్నాడు. ట్రైలర్ సచిన్ ఖేడేకర్, వెన్నెల కిషోర్, సీరత్ కపూర్, రాహుల్ రామకృష్ణ, అయేషా ఖాన్ మొదలైన ఇతర ప్రముఖ నటీనటులను కూడా పరిచయం చేసింది.
గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ .. ట్రైలర్ లో మీరు చూసింది కొంచమే. సినిమాలో చాలా వుంది. థియేట్రికల్ గా ఈ సినిమా మోస్ట్ బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్ అవుతుంది. అన్ని ఏజ్ గ్రూప్స్ కి ఇది కిక్-యాస్ ఫిల్మ్. మీ పేరెంట్స్ కి చూపించండి. థెయ్ రియల్లీ లవ్ ఇట్. థిస్ ఫిల్మ్ రియల్లీ స్పెషల్ వన్. శర్వా గారు అమెజింగ్ యాక్టర్. ఈసారి డిఫరెంట్ శర్వాగారిని చూస్తారు. ఫ్యాన్స్ పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. కృతి ఫెంటాస్టిక్. పెర్ఫార్మెన్స్ ఇరగదీసేసింది. విజువల్స్, మ్యూజిక్ ప్రతి వారు ఫుల్ లవ్ తో పని చేసే ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. నా కెరీర్ లో మనమే ఒక మ్యాజిక్. ఆ మ్యాజిక్ ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఇది నా ప్రామిస్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు మాకు కావాల్సిన ఇచ్చి సినిమాని ఇంత పెద్ద స్కేల్ లో తీయడానికి హెల్ప్ చేశారు. థాంక్ యూ సో మచ్’ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. టీంతో పని చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. జూన్ 7న అందరూ థియేటర్స్ లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలి’అన్నారు.
హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ.. అందరికీ థాంక్ యూ సో మచ్. ట్రైలర్ కంటే ఎంటర్ టైనింగ్ గా వుంటుంది సినిమా. సినిమాలో ఎంటర్ టైన్మెంట్ తో పాటు అందమైన ఎమోషన్ వుంది. త్రీ జనరేషన్స్ ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళండి చాలా ఎంజాయ్ చేస్తారు. శర్వాగారు వండర్ ఫుల్ పెర్ఫార్మర్. ఆయన వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ క్యారెక్టర్ చేయడం నా లైఫ్ లో వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. డైరెక్టర్ శ్రీరామ్ గారికి థాంక్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెరీ స్వీట్ ప్రొడ్యూసర్స్. చాలా సపోర్ట్ చేశారు. ఫారిన్ షూటింగ్ లో కూడా మా ఇంటిని మిస్ చేయలేదు. అంత కేర్ తీసుకున్నారు. అందరికీ థాంక్స్. సినిమాని ఆదరిస్తారని గట్టిగా కోరుకుంటున్నాను’ అన్నారు.
హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. స్వామీ శరణం. ఐ లవ్ యూ ఆల్. ఈసారి కుమ్మేశాం. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ. ఇది రాసిపెట్టుకోండి. ఆల్మోస్ట్ రెండేళ్ళు అయిపొయింది నా సినిమా వచ్చి. మనమే మ్యాజికల్ బ్లాక్ బస్టర్ సినిమా. రాసిపెట్టుకోండి. చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం. మంచి సినిమా తీశాం. జూన్ 7న సెలెబ్రేట్ చేసుకుందా. మనమే మన తల్లితండ్రులకు డెడికేట్ చేస్తున్న సినిమా. ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే సినిమా. శతమానం భవతి కంటే డబుల్ హిట్ కావాలని కోరుకుంటున్నా. అవుతుందనే నమ్మకం కూడా వుంది. నమ్మకంతో చెబుతున్నా. ఈ సినిమా బ్లాక్ బస్టర్. జూన్ 7 ఫ్యామిలీతో కలసి చూడండి. వన్ పర్శంట్ కూడా డిస్సాపాయింట్ చేయదు. మంచి సినిమా చూసి వెళ్తారనే హామీ నేనిస్తా. స్వామీ శరణం’ అన్నారు.
నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం. థాంక్ యూ వన్ అండ్ ఆల్’ అన్నారు.
అసోసియేట్ ప్రొడ్యూసర్ ఏడిద రాజా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, రామ్సే స్టూడియోస్ సమర్పణలో మనమే చాలా స్వీట్ జర్నీ మాకు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వబోతోంది. ఇది మెమరబుల్ ఎక్స్ పీరియన్స్ మాకు. డెఫినెట్ గా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతోంది. మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన శర్వానంద్ గారికి, కృతి శెట్టిగారికి, శ్రీరామ్ గారికి కృతజ్ఞతలు’ తెలిపారు.
నటీనటులు: శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య, సచిన్ ఖేడేకర్, వెన్నెల కిషోర్, సీరత్ కపూర్, రాహుల్ రామకృష్ణ, అయేషా ఖాన్, శివ కందుకూరి తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
ప్రొడక్షన్: రామ్సే స్టూడియోస్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కృతి ప్రసాద్, ఫణి వర్మ
అసోసియేట్ ప్రొడ్యూసర్: ఏడిద రాజా
డైలాగ్స్: అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
డీవోపీ: విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ VS
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: జానీ షేక్
పీఆర్వో: వంశీ-శేఖర్