కమల్‌కు విలన్‌గా మారిన మలయాళీ స్టార్ హీరో

కోలీవుడ్ స్టార్ హీరో కమల్‌హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుండగా.. సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్‌ను పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త హాట్‌టాపిక్‌గా మారింది,

ఈ సినిమాలో ఒక మలయాళ స్టార్ హీరో విలన్‌గా నటించనున్నాడట. అతడే నటుడు ఫామిద్ ఫాజిల్. మలయాళంలో ఎన్నో సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఫాహిద్ ఫాజిల్ సంపాదించుకున్నాడు. గతంలో మలయాళంలో కొన్ని సినిమాల్లో విలన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు తమిళంలో కమల్ హాసన్ పక్కన విలన్‌గా నటించనుండటం స్పెషల్ అని చెప్పవచ్చు.

తమిళనాడు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో రాజకీయాల్లో కమల్ హాసన్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విక్రమ్ సినిమాతో భారతీయుడు 2 సినిమా కూడా కమల్ చేస్తున్నాడు. కానీ లాక్‌డౌన్ తర్వాత తిరిగి భారతీయుడు 2 సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల స్టార్ట్ అవ్వలేదు.