ఓ నెటిజ‌న్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన మాధ‌వ‌న్‌!

ప్ర‌ముఖ న‌టుడు మాధ‌వ‌న్ మ‌ద్యానికి బానిస‌య్యాడ‌ని ఓ నెటిజ‌న్‌ సోష‌ల్‌మీడియాలో కామెంట్స్ చేశాడు. దీనిపై మాధ‌వ‌న్ ‌త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చారు. వివ‌రాల్లోకి వెళితే.. మాధ‌వ‌న్ ఒక‌ప్పుడు నా అభిమాన న‌టుడు కానీ ఆయ‌న మ‌ద్యం, మాద‌క ద్ర‌వ్యాలు సేవిస్తూ కెరీర్ నాశ‌నం చేసుకుంటున్నార‌ని ఓ నెటిజ‌న్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. బాలీవుడ్‌లో మాధ‌వ‌న్ న‌టించిన మొద‌టిసినిమాలో ఆయ‌న‌ ఎంతో ఆయ‌ర్ష‌ణీయంగా ఉండేవార‌ని, ప్ర‌స్తుతం అలా లేర‌ని పోస్ట్ పెట్టారు. ఇక దీనిపై మాధ‌వ‌న్ స్పందిస్తూ.. మీ కామెంట్ చూస్తుంటే మీకు అజీర్తి రోగం ఉందేమోన‌ని నా సందేహం. మీ అనారోగ్యానికి నేను చాలా బాధ‌ప‌డుతున్నాన‌ని, వెంట‌నే మీరు త‌ప్ప‌కుండా మంచి వైద్యుడిని క‌ల‌వాల‌ని ఆ నెటిజ‌న్‌కు సూచించారు. దీంతో సోష‌ల్‌మీడియాలో ఎంతో మంది నెటిజ‌న్లు మాధ‌వ‌న్‌కు స‌పోర్టుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం మాధ‌వ‌న్ న‌టించిన త‌మిళ్ మూవీ‌ మారా జ‌న‌వ‌రి 8న అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల కానుంది.. అలాగే మాధ‌వ‌న్ ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయ‌ణ్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ సినిమాలో న‌టిస్తున్నాడు.