సందీప్ కిషన్, తెనాలి రామకృష్ణ BA BL షూటింగ్ మొదలు.

యంగ్ హీరో సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ BA BL అనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. కొన్ని రోజుల కింద ఓపెనింగ్ జరుపుకున్న ఈ చిత్ర షూటింగ్ గురువారం కర్నూలులో మొదలైంది. హీరో సందీప్ కిషన్, హన్సిక ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. జి నాగేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మురళి శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, పృధ్వి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. SNS క్రియేషన్స్ బ్యానర్ పై తెనాలి రామకృష్ణ BA BL నిర్మిస్తున్నారు.

నటీనటులు..
సందీప్ కిషన్, హన్సిక, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, ప్రభాస్ శీను, పృద్వి..

సాంకేతిక నిపుణులు..
దర్శకుడు: G నాగేశ్వర రెడ్డి
నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి
బ్యానర్: శ్రీ నీలకంటేశ్వర స్వామి క్రియేషన్స్
సమర్పణ: ఇందుమూరి శ్రీనివాసులు
సహ నిర్మాత: రూప జగదీష్, వి మహేశ్వర రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల
స్టోరీ, స్క్రీన్ ప్లే: T రాజసింహ
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
కో డైరెక్టర్: రమేష్ నాయుడు యాపాటి
అసోసియేట్ డైరెక్టర్స్: చిట్టి, శివ
స్క్రీన్ ప్లే: విక్రమ్ రాజ్, గోపాలకృష్ణ
ఆర్ట్: కిరణ్
ఎడిటర్: ఛోటా K ప్రసాద్
మాటలు: నివాస్, భవాని ప్రసాద్
PRO: వంశీ శేఖర్
కాస్ట్యూమ్స్: నరసింహా రావు
మేకప్: వాసు
యాక్షన్: రామ్-లక్ష్మణ్, వెంకట్
లిరిక్స్: భాస్కరభట్ల, చందు
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: CH విజయ్ కుమార్, K రఘునాథ్ రెడ్డి