శ్రీరాముని అయోధ్య రామ మందిరం కోసం హను-మాన్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా టైటిల్ రోల్ లో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం “హను మాన్” స్ట్రాంగ్ ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మార్కును క్రాస్ చేసిన ఈ సినిమా వీక్ డేస్ లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. హను-మాన్ రెండవ వారాంతంలో దేశీయ, విదేశాలలో మ్యాగ్జిమమ్ ఆక్యుపెన్సీని చూసింది.

ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌తో పాటు, ప్రజల ఆదరాభిమానాలను అందుకుంది. అయోధ్యలోని రామ మందిరానికి ప్రతి టిక్కెట్ నుండి రూ. 5 ఇవ్వడం ద్వారా అయోధ్యలోని భగవాన్ శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో చేరింది.

మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పేర్కొన్నట్లుగా, వారు అయోధ్య రామమందిరానికి ఒక్కో టికెట్ నుండి ₹5 ఇస్తున్నారు. వారు సినిమా ప్రీమియర్ షోల నుండి విక్రయించిన 2,97,162 టిక్కెట్లలో ₹ 14,85,810 చెక్కును ఇప్పటికే అందించారు.

అయోధ్య రామమందిరం కోసం ఇప్పటి వరకు విక్రయించిన 53,28,211 టిక్కెట్ల నుంచి రూ.2,66,41,055 అందిస్తున్నట్లు ప్రకటించారు.