నితిన్, ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి, శ్రేష్ట్ మూవీస్ ‘మాచర్ల నియోజకవర్గం’లో మరో హీరోయిన్ గా కేథరిన్ థ్రెసా

విభిన్న కథలు చేస్తోన్న హీరో నితిన్ ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్నారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న చిత్రంలో నితిన్‌ను ఫుల్ యాక్షన్ మోడ్‌లో ప్రేక్షకులు చూడబోతోన్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో ,ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్,  శ్రేష్ట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రయూనిట్ హైద్రాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఇద్దరు హీరోలు కనిపించబోతోన్నారు. ఇందులో కృతి శెట్టి ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. తాజాగా కేథరిన్ థ్రెసాను మరో హీరోయిన్గా చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లోనే కేథరిన్ థ్రెసా పాల్గొనబోతోన్నారు. కేథరిన్ థ్రెసా, నితిన్‌లు కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇదే.

నితిన్‌ను ఇది వరకెన్నడూ చూపించని కొత్త అవతారంలో దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి చూపించబోతోన్నారు. ఇంకా ఈ చిత్రంలో ఎంతో మంది ప్రముఖ నటీనటులున్నారు. అద్భుతమైన సాంకేతిక బృందం ఈ సినిమా కోసం పని చేస్తోంది.

భీష్మ, మాస్ట్రో వంటి చిత్రాల తరువాత మూడోసారి మహతి స్వరసాగర్‌తో కలిసి నితిన్ పని చేస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల కెమెరామెన్‌గా, మామిడాల తిరుపతి మాటల రచయితగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు.

నటీనటులు : నితిన్, కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా తదితరులు

సాంకేతిక బృందం
రచయిత, దర్శకుడు : ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి
సమర్పణ : రాజ్ కుమార్ ఆకెళ్ళ
నిర్మాత : సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
బ్యానర్ :  శ్రేష్ట్ మూవీస్
సంగీతం  : మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫర్ :  ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్ :  కోటగిరి వెంకటేశ్వర రావు
లైన్ ప్రొడ్యూసర్ :  జీ హరి
మాటలు :  మామిడాల తిరుపతి
ఆర్ట్ డైరెక్టర్ :  సాహి సురేష్
పీఆర్ఓ : వంశీ-శేఖర్