‘జోహార్’ హక్కులు పొందిన అభిషేక్ పిక్చర్స్

తేజ మర్ని డైరెక్షన్ వహిస్తుండగా, ఐదు పాత్రల చుట్టూ తిరిగే పొలిటికల్ సెటైర్ ఫిలిం ‘జోహార్’. ‘దృశ్యం’ ఫేమ్ ఎస్తర్ అనిల్ నటించిన ఈ సినిమా వేసవికి రిలీజ్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు థియేట్రికల్, అటు నాన్ థియేట్రికల్ హక్కులను పేరుపొందిన నిర్మాత అభిషేక్ నామా సొంతం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో ‘రాక్షసుడు’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి అనేక సక్సెస్ ఫుల్ ఫిలిమ్స్ ను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా సమర్పించి, విడుదల చేశారు. అలాగే ‘ప్రెజర్ కుక్కర్’ వంటి కంటెంట్ రిచ్ స్మాల్ ఫిలిమ్స్ ను ఆయన విడుదల చేస్తున్నారు. అంతే కాదు.. విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ చేస్తోన్న ‘వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ’ ఆంద్ర్హా హక్కులను ఆయన పొందారు.

‘జోహార్’ మూవీ విషయానికి వస్తే సీనియర్ తార ఈశ్వరీరావు. చైతన్య కృష్ణ సపోర్టింగ్ రోల్స్ పోషించారు. ప్రియదర్శన్ మ్యూజిక్ అందించగా, జగదీష్ చీకటి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ధర్మ సూర్య పిక్చర్స్ పతాకంపై భాను సందీప్ మర్ని ‘జోహార్’ సినిమాని నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ సహా ఇతర వివరాలను చిత్ర బృందం త్వరలో ప్రకటించనుంది.

తారాగణం:
ఎస్తర్ అనిల్, నైనా గంగూలీ, ఈశ్వరీ రావు, శుభలేఖ సుధాకర్, చైతన్యకృష్ణ, అంకిత్ కొయ్య, రోహిణి.

సాంకేతిక బృందం:
సమర్పణ: అభిషేక్ నామా
బ్యానర్స్: అభిషేక్ పిక్చర్స్, ధర్మ సూర్య పిక్చర్స్
నిర్మాత: భాను సందీప్ మర్ని
దర్శకుడు: తేజ మర్ని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ బిక్కిన, కళ్యాణ్ ఎం., రాఘవేంద్ర చౌదరి
సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి
మ్యూజిక్: ప్రియదర్శన్
ఎడిటర్: సిద్ధార్థ్
ఆర్ట్: గాంధీ
లిరిక్స్: చైతన్య ప్రసాద్.