గ్రాండ్ గా జరిగిన ” క్రేజీ కేజీ ఫీలింగ్” ఆడియో లాంచ్

విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం ” క్రేజీ క్రేజీ ఫీలింగ్ “. సంజయ్ కార్తీక్ దర్శకుడు. విష్వoత్ , పల్లక్ లల్వాని జంటగా నటించారు. ఈ చిత్రం ఆడియో లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. భీమ్స్ సంగీతమందించిన ఈ చిత్ర ఆడియో బిగ్ సీడీని హీరో సుమంత్ అశ్విన్, నిర్మాత దామోదర్ రెడ్డి చేతుల మీదుగా గ్రాండ్ గా జరిగింది.
యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 22న విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్ ద్వారా బాపిరాజు గారు విడుదల చేస్తున్నారు.

దర్శకుడు సంజయ్ కార్తీక్ మాట్లాడుతూ… ఈ సినిమాకు సంబంధించి చాలా మందికి థాంక్స్ చెప్పాలి. ఇక్కడికి వచ్చిన గెస్ట్ లందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. కుటుంబంతో కలిసి చూసే వినోదాత్మక చిత్రమిది. చక్కటి ఫ్యామిలీ సినిమా. షూటింగ్ అంతా హ్యాపీగా జరిగింది. మా హీరో విశ్వంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోయిన్ చాలా బాగా చేసింది. టీం అందరూ బాగా సహకరించారు. ఈ సినిమాకు కారణమైన నిర్మాత నూతలపాటి మధు గారికి స్పెషల్ థాంక్స్ చెప్పాలి. నాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. అని అన్నారు.

నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ….. ముందుగా నిర్మాతకి థాంక్స్ చెప్పాలి. సంజయ్ కార్తీక్ నాకు ముందునుంచే పరిచయం. చాలా రోజులు కలిసి ట్రావెల్ చేశాం. క్రేజీ క్రేజీ ఫీలింగ్ తో కేరింత పెట్టే రోజు దగ్గర్లోనే ఉంది. బీమ్స్ మంచి బీట్స్ ఉన్న పాటలందించాడు. సుభాష్ కెమెరా వర్క్ చాలా బాగుంది. సంజయ్ పంచులు వేస్తే పక్కోడి పంచెలు ఊడాల్సిందే. సంజయ్ ఎన్ని కష్టాలున్నా నవ్వుతూనే ఉంటాడు. ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. తప్పకుండా క్రేజీ క్రేజీ ఫీలింగ్ చూసి ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అని అన్నారు.

హీరో విశ్వాంత్ మాట్లాడుతూ… ఈ సినిమా ఇంత బాగా జరగడానికి కారణం డైరెక్టర్ సంజయ్ కార్తీక్. నేను ఫస్ట్ డే కథ విన్నప్పటి నుంచి మిస్ కమ్యూనికేషన్ లేకుండా చేశాడు. థాంక్స్ టూ సంజయ్. ఈయనకు పెద్ద బ్రేక్ రావాలి. నేను నటించిన సినిమా వన్ ఇయర్ తర్వాత రిలీజ్ అవుతోంది. పెద్ద రిలీజ్ అవ్వాలనుకున్నాను.. గతంలో నేను చేసిన కేరింత, మనమంతా మంచి సినిమాలు ఎక్కువ డ్రామాతో కూడుకున్నవి. కామెడీ నేను గతంలో చేయలేదు. సినిమాలో కామెడీ చేయడం చాలా కష్టం. అది నాకు ఈజీ అయ్యిందంటే కారణం మా డైరెక్టర్. మా డైరెక్టర్ క్రేజీ మ్యాన్. సెట్లో మంచి ఎనర్జీ ఉండేది. టీం అందరికీ థాంక్స్ చెబుతున్నాను. మ్యూజిక్ భీమ్స్ అందించారు. చాలా థాంక్స్. మా కోడైరెక్టర్ శ్రీనివాస్ గారు. సాయి కి స్పెషల్ థాంక్స్. చాలా కష్టపడ్డారు. లవ్ చేసి సినిమా తీస్తే మంచి సినిమా వస్తుంది. ఇక్కడికి వచ్చిన పెద్దలెందరూ మమ్మల్ని ఆశీర్వదించారు. పాలక్ మంచి యాక్ట్రెస్. తనకు బిగ్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. అని అన్నారు.

నటీనటులు
విష్వoత్ , పల్లక్ లల్వాని ,వెన్నెల కిశోర్ , ఫిదా ఫేమ్ శరణ్య , సుమన్ , పోసాని తదితరులు

సాంకేతిక వర్గం
బ్యానర్ – విజ్ఞత ఫిలిమ్స్ పతాకం
సంగీతం – భీమ్స్ సిసిరోలియో,
సాహిత్యం – సురేష్ ఉపాధ్యాయ , కాసర్ల శ్యామ్ ,
కెమెరా – సుభాష్ దొంతి ,
ఆర్ట్ – నాగు ,
కొరియోగ్రఫీ – రాజకిరణ్ , చార్లీ
పిఆర్వో – ఏలూరు శ్రీను
నిర్మాత – నూతలపాటి మధు
కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – సంజయ్ కార్తీక్