ఎమ్మెల్యేగా నమిత?.. ఎక్కడో తెలుసా?

జెమినీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నమిత.. ఆ తర్వాత బిల్లా, సింహా లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైన నమిత.. త్వరలో మళ్లీ ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎమ్మెల్యే పాత్రలో నమిత నటించనుందట.

namitha

ఈ సినిమాలో అమలాపాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముందుగా ఎమ్మెల్యే పాత్ర కోసం రోజాను సంప్రదించారట. కానీ ఆ పాత్రను చేయడానికి రోజా ఒప్పుకోకపోవడంతో నమితను తీసుకున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యే పాత్ర నెటిటివ్ రోల్ అని తెలుస్తోంది. దీంతో ఆ పాత్రలో నమిత ఎలా నటిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.