మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆది సాయి కుమార్. తెలుగులో ప్రేమకావాలి, లవ్లీ సినిమాలతో తనకంటూ సొంత ఫాలోయింగ్ తెచ్చుకున్న ఆది నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్. అడివి శేష్ అన్న సాయి కిరణ్ అడివి తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ తోనే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. ఇప్పుడు దసరా పండగ సందర్భంగా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్ గా ఇండియా పాకిస్థాన్ బార్డర్ ఇష్యూస్ ని డిస్కస్ చేస్తూ డిజైన్ చేసిన స్క్రిప్ట్ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనుందని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. ట్రైలర్ లో ఆది చాలా ఫ్రెష్ గా, కొత్త లుక్ లో పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు. జిహాద్, మిషన్ కాశ్మీర్ లాంటి పదాలు ట్రైలర్ లో రెగ్యులర్ గా వినిపించాయి వీటిని బట్టి చూస్తే ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లో కాశ్మీర్ సమస్య గురించి గట్టి పాయింట్ నే రైజ్ చేసినట్లు ఉన్నారు.
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ట్రైలర్ లో ఆర్జే హేమంత్ కూడా కనిపించాడు, ఇతని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, కాశ్మీర్ లో ఒకప్పుడు పండిట్స్ ఉండేవారు. కాశ్మీరీ పండిట్స్ గా పేరు తెచ్చుకున్న వీరి పాత్రలోనే హేమంత్ కనిపిస్తున్నాడు. హర్ హిందూస్థానీ కాశ్మీర్ కే సాత్ హై అని హేమంత్ చెప్పే డైలాగ్ లో చాలా ఇంపాక్ట్ ఉంది. మేకింగ్ పరంగా చాలా రిచ్ గా ఉన్న ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కి ప్రధాన బలం శ్రీచరణ్ పాకాల సంగీతం. ట్రైలర్ లో వచ్చిన బీజీఎమ్ ఆకట్టుకుంది, ట్రైలర్ అంత ఇంప్రెసివ్ గా ఉంది అంటే దానికి కారణం శ్రీచరణ్ ఇచ్చిన మ్యూజిక్ మాత్రమే. అడివి శేష్ సినిమాలకి రెగ్యులర్ గా మ్యూజిక్ ఇచ్చే శ్రీచరణ్, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కి డెఫినెట్ గా ఎస్సెట్ అవుతాడు. అడివి సాయి కిరణ్, శ్రీచరణ్ తర్వాత మాట్లాడుకోవాల్సింది అబ్బూరి రవి గురించే. గూఢచారి సినిమాకి తన మాటలతోనే ప్రాణం పోసిన అబ్బూరి రవి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా విషయంలో కూడా అదే చేసినట్లు ఉన్నాడు. దేశ భక్తి సినిమాలకి ఉండాల్సిన ఎమోషన్ ని అబ్బూరి రవి తన డైలాగ్స్ తోనే ఎలివేట్ చేశాడు. ముఖ్యంగా ట్రైలర్ చివరలో వచ్చిన జై హింద్ మా జిహాద్ అయితే అనే డైలాగ్ చాలా బాగుంది. మొత్తానికి తమ్ముడు బాటలోనే నడుస్తూ సాయి కిరణ్ అడివి తెరకెక్కిస్తున్న ఈ థ్రిల్లర్ ట్రైలర్ తోనే అంచనాలని అమాంతం పెంచింది.